– ఎండి పోయన పెద్దవాగు, చెరువులు
– బోర్లలో నీళ్లు రాక రైతులు విలవిల
– దిక్కు తోచని స్థితిలో అన్న దాతలు
– డిస్ట్రిబ్యూటరీ, ఎడమ కాలువకు నీటి విడుదల చేయాలని వినతి
నవతెలంగాణ – పెద్దవూర
సాగు నీరందక నెర్రెలు వారుతున్నాయి పొలాలు. బోరుబావులపై ఆధారపడి వరి సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వేసవి ప్రారంభం నుంచే ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలు అన్ని అండుగంటి పోతున్నాయి. దీంతో వరి పంట వేసిన రైతులు సాగు నీరు లేక నానా అవస్థలు పడుతున్నారు. ఎండలు క్రమ క్రమంగా ముదురుతున్నాయి. ముఖ్యంగా పెద్దవూర మండలం అంతా మెట్ట ప్రాంతమే వరద కాలువ,ఏఎంఆర్ పీ కాలువల ద్వారానే సాగు చేస్తున్నారు.కానీ సాగర్ జలాశయం డెడ్ డెడ్ స్టరేజీకి చేరింది. దీంతో నీటి విడుదల చేయక చేలు అన్ని బీళ్ళుగా మారాయి. డిస్ట్రిబ్యూటరీ కాలువలకు నీటిని విడుదల చేస్తారని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. వరి పొలాలు నేర్రెలు వారి ఎండి పోతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల బోర్లలో నీళ్లురాక సాగు చేసిన పొలాలు కళ్ల ముందే ఎండిపోతుంటే రైతులు కన్నీరవు తున్నారు.
బోరు బావులకింద సాగు: మెట్ట ప్రాంతం కావడం,భూగర్భ జలాలు చాలా అడుగంటడంతో ఎక్కువ శాతం బోరుబావుల కింద పంటలను సాగు చేయగా, సరిగ్గా నీరందించలేకపోవడంతో వరి చేలు ఎండుముఖం పడుతున్నాయి. ఆరుగాలం శ్రమంతా వృథా అవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగి పంట పండించడం కష్టమే అని అంటున్నారు రైతన్నలు. వర్షాకాలం సీజన్‌లో వర్షాలు కురవక సాగర్ ప్రాజెక్టు లోకి వరదలు రాక చెరువులు, కుంటలు కూడ పూర్తిగా ఎండి పోయాయి. అనా వృష్టి తో కొన్ని ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లి చేతికి రాకుండా నేలపాలైంది. మార్చి మొదటివారం నుంచే ఎండలు తీవ్రరూపం దాల్చడంతో వ్యవసాయ బావుల్లో నీరు అడుగంటి పోతున్నాయి. బోర్లు నీరు ఇంకిపోతున్నయి. దీంతో వరికి సరిపడా నీరందించలేక రైతులు అల్లాడుతున్నారు. పంటను దక్కించుకోవాలన్న తపనతో కొందరు వ్యవసాయ బావుల్లో పూడికతీతను చేపట్టారు. మరికొందరు అప్పు చేసి బోర్లు వేయిస్తున్నారు. అయినా చుక్కనీరు పడకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చేసేదేమీ లేక నెర్రెలువారిన చేనులో పశువులను మేపుతున్నారు.
కొంతమంది రైతులు. నీరు లేక చాలా చోట్ల పొట్ట దశలో వరి మాడిపోతు న్నాయి.
పెద్దవూర మండలంలో 752.65 హెక్టర్లు వరి సాగు: పెద్దవూర మండలంలో వెల్మగూడెం, పెద్దవూర చెరువులకింద 96 హేక్టర్లు,బసిరెడ్డి చెరువుకింద 34, సంగారం చెరువు కింద 91, తెప్పల మడుగు చెరువు కింద15 చింతపల్లి 35, పర్వేదుల చెరువు కింద 22, అదేవిదంగా చలకుర్తి ఎత్తిపోతలకింద 90, నాయినవాని కుంట, తుంగతుర్తి చెరువులకింద 42, హేక్టర్లు లలో వరి సాగు చేశారు. మండలం లో పెద్దవూర, పోతునూరు శిరసనగండ్ల చెరువులు మాత్రమే కొద్ది పాటి నీళ్లు ఉన్నాయి. మిగితా చెరువుల్లో చుక్క నీళ్లు లేవు.పెద్దవూర పెద్ద వాగు పూర్తిగా ఎండిపోయి వెలవెల బోయింది. వేల ఎకరాలలో వరి సాగుచేయగా ఇప్పటికే చాలా వరకు పొలాలు నీళ్లు లేక ఎండి పోతున్నాయి. పంటలకు మంచి తరుణం లో బోర్లలో పూర్తిగా నీరు ఇంకిపోవడంతో సాగుచేసిన పంటల్లో సగానికిపై ఎండిపోయే ప్రమాదం వుంది. ఫలితంగా రైతులకు పెట్టుబడి సైతం చేతికందని పరిస్థితి నెలకొంది.దాంతో పర్వేదుల, చలకుర్తి, కొతలూరు, ఇంకా చాలా గ్రామాల్లో పొలాలు ఎండి పోవడం తో చేసేది లేక పశువులను మేపుతున్నారు.జనవరి నుంచే నీటి గండం మొదలైందని. ఇంకా కనీసం 30 రోజులైనా గడిస్తే కొంత పంట చేతికి వస్తుందన్న ఆశ తప్ప వేరే ఆధారం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.సాగు చేసిన పొలాలు పండాలంటే డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా నీటిని విడుదల చేసి చెరువులను నింపాలని, అలాగే ఎడమ కాలువకు వారం రోజులపాటు నీళ్లు విడుదల చేయాలని రైతులు వేడుకుంటున్నారు.
ఎడమ కాలువకు నీళ్లు విడుదల చేసి పంట పొలాలు కాపాడాలి… రైతు దండ సుధాకర్ రెడ్డి: పంట పొలాలకు సాగునీరు అందించి ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయాయి. సాగునీటి కోసం వ్యవసాయ భూమిలో నాలుగు బోర్లు వేస్తే చుక్కనీరు కూడ పడడంలేదు. మూడు ఎకరాలు వరిసాగు చేశాను. రెండు ఎకరాలు నీళ్లు లేక నేర్రెలు వారాయి. దాంతో చేసేది లేక బర్లను మేపుతున్నాను. సాగునీటి కోసం ప్రభుత్వం ఏఎంఆర్ డిస్ట్రిబ్యూటరీ, వరద కాలువలకు నీళ్లు విడుదల చేసి చెరువులు నింపి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాము.