వరుసగా ఐదో గేమ్‌ డ్రా

Fifth consecutive game draw– ఫిడే ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌
సింగపూర్‌ : డి. గుకేశ్‌-డింగ్‌ లెరెన్‌ల మధ్య జరుగుతున్న ఫిడే ప్రపంచ ఛెస్‌ చాంపియన్‌షిప్‌ ఎనిమిదో రౌండ్‌ గేమ్‌ డ్రా అయ్యింది. దీంతో వరుసగా ఐదో గేమ్‌ డ్రాతో ముగిసినట్టయ్యింది. బుధవారం జరిగిన ఎనిమిదో రౌండ్‌ గేమ్‌లో డి. గుకేశ్‌ నల్ల పావులతో, డింగ్‌ తెల్ల పావులతో గేమ్‌లు ఆడారు. లిరెన్‌ సి-4తో, గుకేశ్‌ ఇ-5తో గేమ్‌లను ప్రారంభించారు. ఎనిమిదోరౌండ్‌ గేమ్‌ కూడా డ్రా కావడంతో ఇరువురు గ్రాండ్‌మాస్టర్లకు అర పాయింట్‌ చొప్పున దక్కింది. ఈ గేమ్‌ సుమారు 51 ఎత్తుల సేపు సాగింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన చైనా గ్రాండ్‌మాస్టర్‌కు గుకేశ్‌ చెమటలు పట్టిస్తున్నాడు. ఎనిమిదోరౌండ్‌ గేమ్‌ ముగిసేసరికి ఇరువురు గ్రాండ్‌మాస్టర్లు 4పాయింట్లతో సమంగా ఉన్నారు.