హైదరాబాద్ : అమెరికాకు చెందిన ఫిగరోస్ పిజ్జా హైదరాబాద్‌లో తన నూతన అవుట్‌టెల్‌ను తెరిచింది. భారత్‌లో తన ఉనికిని విస్తరించడానికి మహారాష్ట్ర, గోవా, గుజరాత్ మినహా రాష్ట్రాల్లో దేశవ్యాప్త మాస్టర్ ఫ్రాంచైజీగా ఇచక్టానా ఫుడ్ సేవలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. నూతన రెస్టారెంట్‌ను కొండాపూర్‌లోని గూగుల్ ఆఫీస్ ఎదురుగా ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ‘అసాధారణమైన నాణ్యత, అసాధారణమైన రుచి, అసాధారణమైన సేవలను మిళితం చేసే ఎప్పటికీ గుర్తుండిపోయేలా భోజన అనుభవాన్ని సృష్టించడం మా లక్ష్యం. పిజ్జా పట్ల మాకున్న ప్రేమను హైదరాబాద్ ప్రజలతో పంచుకోవడానికి సంతోషంగా ఉన్నాం. మా వద్ద 45 రకాల పిజ్జాలు లభిస్తాయి” అని ఫిగరోస్ పిజ్జా ఏరియా డెవలపర్ శర్వన్ కుమార్ గ్రాండి పేర్కొన్నారు.