పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలి

– పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ 
నవతెలంగాణ – అచ్చంపేట
కేంద్రం లోని బారతీయ జనతాపార్టీ ప్రవేశ పెట్టిన సీఏఏ ఎన్నా ఆర్సీ& ఎన్పీఆర్ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలని,  పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆద్వర్యంలో అచ్చంపేటలో సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన సదస్సులో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు. ఈ చట్టాలు లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశానికి చాలా వ్యతిరేకంగా ఉన్నాయని , ఈ దేశంలోని ముస్లిం మైనారిటీలను, క్రైస్తవులను , రెండవ తరగతి పౌరులుగా పేర్కొనే ప్రమాదముందన్నారు.  దేశ వ్యాప్తంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో కులనిర్మూలనా పోరాట సమితి రాష్ట్ర నాయకులు ముద్దునూరి లక్ష్మినారాయణ, జిల్లా నాయకులు మంతటి పర్వతాలు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ నాగభూషణం ,కో కన్వీనర్ ఎడ్ల అంబయ్య, తెలంగాణ నిర్వాసిత వ్యతిరేక ఫోరం జిల్లా కన్వీనర్ గోరటి అనిల్ కుమార్, పౌరహక్కుల సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జక్క బాలయ్య, ఉపాద్యక్షలు పంబలి బాలయ్య, సబ్యులు నారుమళ్ల లక్ష్మినారాయణ, చైతన్య మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్ శ్రీదేవి, డిటిఎఫ్ నుండి జక్క రామస్వామి, మోతిరాం,పాలమూరు అధ్యయన వేదిక నాయకులు గాజుల లక్ష్మి నారాయణ, అశోక్ లతో పాటు ముస్లిం మైనారిటీలు, క్రైస్తవ సోదరులు, తదితరులు పాల్గొన్నారు.