‘రామ్ చరణ్‌ని చూస్తే.. లోలోపల ఏదో తెలియని శక్తిని కంట్రోల్ చేసి పెట్టుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. టైం, సందర్భంగా వచ్చినప్పుడు ఆ శక్తి విస్పోటనం చెందుతుందా?అన్నట్టుగా ఉంటుంది. డీప్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగల గొప్ప ఆర్టిస్ట్. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న రామ్‌చరణ్ ఎలాంటి సీన్ అయినా అద్భుతంగా, అందంగా హ్యాండిల్ చేస్తారు’ అని దర్శకుడు శంకర్ అన్నారు. రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ చేంజర్’. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అవినీతి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే ఐఏఎస్ అధికారిగా ఇందులో రామ్‌చరణ్ కనిపించనున్నారు. టీజర్‌లో రకరకాల గెటప్స్, డిఫరెంట్ లుక్స్‌లో ఉన్న రామ్‌చరణ్‌ను చూపించారు. రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న హై-ఆక్టేన్ యాక్షన్‌తో సినిమా అద్భుతంగా ఉంటుంది. ”జరగండి”, ”రా మచ్చా”, ”జానా హైరాన్ సా” పాటలు చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. నాలుగో పాట అయిన ‘డోప్’ని ఈనెల 22న రిలీజ్ చేస్తారు అని చిత్ర యూనిట్ తెలిపింది.