రాజ్యాంగం ప్రకారం కావాలని ఒకరు
కాదు అది రాజ్యాంగం విరుద్ధమని మరొకరు
కొట్లాట పెట్టాం కొట్టుకు చావండి అనేట్టు
అమలు చేసింది లేదు
అనుభవించింది లేదు
మనువాదం అని ఒకరు
మదం ఎక్కింది అని మరొకరు
దొబ్బి తిన్నారని ఒకరు
దొబ్బుకు పోయేందుకని మరొకరు
అన్నదమ్ముల్లా ఉంటున్న వాళ్లను
పచ్చగడ్డి వేస్తే మండేలా చేశారు
ఆ ఇద్దరి తగువులో
విస్ఫోటనం తప్పేలా లేదు
ఇద్దరూ ఉంటున్నది ఊరి బయట గుడిసెలోనే
ఊళ్లోకి రావాలని ప్రయత్నిస్తే ఆపేదెవరు..
కొట్లాట కొద్దిసేపు ఆపి మీ కుర్చీలో
ఎవరో ఎక్కి కూర్చున్నారు
మొదలు వాడిని దింపి మీరు
ఎలా ఎక్కాలో ఆలోచించండి
మీ కొట్లాటకు
పరిష్కార మార్గం
దొరుకుతుంది
– ఆర్ కె రణదివే, 7993778211