నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
ఉద్యోగస్తులు చేసే సర్వీస్ ని బట్టి, వారు నిర్వర్తించే పనులను బట్టి, ఉద్యోగస్తులు ప్రజలకు చేసే సేవలను బట్టి మంచి సేవా కార్యక్రమాలు చేశారని అటువంటి అధికారులను, ఉద్యోగస్తులను గుర్తించి ఉత్తమ సేవ పథకాలను అందిస్తుంటారు అటువంటిది (రక్షణ శాఖలో) పోలీస్ శాఖలో అధికారులు ఉద్యోగస్తులు చేసిన సేవలను గుర్తించుటకు శాఖ అధికారులు ఉన్నప్పటికీ కొందరు అత్యుత్సాహంతో సేవా పథకం పొందటానికి తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. కొందరు అధికారుల చేతులు తడపడంతో ఆ అధికారులు ఉద్యోగస్తులకు ఉత్తమ సేవ పురస్కారం అందుకుంటున్నారు. ఆ ఉత్తమ సేవ ప్రతి ఆరు నెలలకు ఒకసారి గుర్తించి జిల్లా స్థాయి అధికారుల చేతుల మీదుగా అందుకుంటారు. అటువంటిది ఒక ఉద్యోగస్తునకు ఒకసారి ఒకే సేవా పథకం అందించిన తర్వాత మళ్లీ అదే సేవ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ విషయం కొందరి దరఖాస్తు చేసుకునే వారికి తెలియడంతో (ఈ విషయం బయటకు పొక్కడంతో) దరఖాస్తు దారుడు మళ్లీ విరమించుకునే ప్రయత్నాలు చేయుచున్నారు. ఆ అధికారికి గత 2021 సంవత్సరం జనవరిలో ఉత్తమ సేవ పథకం అందుకున్నారు. ఈ సేవ పథకంతో ప్రభుత్వం 20,000 (రెమ్యూనరేషన్) ప్రోత్సాహకం తో పాటు ఒక ప్రశంస పత్రాన్ని అందజేశారు. అదే ఉద్యోగస్తుడు మళ్లీ 2023లో ఉత్తమ సేవ పథకం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నా విషయం బయటకు తెలియడంతో ఆ ఉద్యోగస్తుడు దరఖాస్తు ను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చిన దరఖాస్తు ను రద్దు చేసుకునే ప్రయత్నం ముమ్మరం చేశారు. సమాజం లో న్యాయం చేయవలసిన అధికారులే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడితే, సమాజం లో వారు న్యాయం ఎలా చేసేరు.