రిపబ్లిక్‌ డే కానుకగా ఫైటర్‌ రిలీజ్‌

రిపబ్లిక్‌ డే కానుకగా ఫైటర్‌ రిలీజ్‌హతిక్‌ రోషన్‌, దీపికా పదుకొనె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఫైటర్‌’. ‘వార్‌, పఠాన్‌’ సినిమాల ఫేమ్‌ సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం రిపబ్లిక్‌ డే కానుకగా ఈనెల25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్‌తో పాటు ఫస్ట్‌ సింగిల్‌, సెకండ్‌ సాంగ్‌కు సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘హీర్‌ ఆస్మాని’ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. సాంగ్‌లో హతిక్‌ రోషన్‌, దీపికా పదుకొనె డాన్స్‌ మూమెంట్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. అనిల్‌ కపూర్‌, అక్షరు ఒబెరారు, సంజీదా షేక్‌ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను వయాకామ్‌ 18 స్టూడియోస్‌, మార్‌ ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ సంస్థలపై మమతా ఆనంద్‌, రామన్‌ చిబ్‌, అంకు పాండే నిర్మిస్తున్నారు.