ప్రజా సమస్యల పై పోరాడేది ఎర్రజెండానే

– ఇండ్లు ఇండ్ల స్థలాలు భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలి
– ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం సమరశీల పోరాటాలు
– సిపిఎం జహీరాబాద్ ఏరియా మహాసభలో.. జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు
నవతెలంగాణ జహీరాబాద్
భూములు,ఇండ్ల స్థలాలు,కార్మిక కర్షక, ప్రజా సమస్యలపై పోరాడేది సిపిఎం ఎర్రజెండానే అని అన్నారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం సిపిఎం సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు అన్నారు . సోమవారం సిపిఎం జహీరాబాద్ ఏరియా 2వ మహాసభ భీమ భవన్ పంక్షన్ హాల్ లో జరిగింది. ఈ మహాసభల సందర్భంగా పార్టీ ఎర్రజెండా ను ఆవిష్కరించిన అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన పార్టీ అగ్రనేత కామ్రేడ్ సీతారాం ఏచూరి ఫోటోకు,జహీరాబాద్ ఏరియా నాయకులు ప్రకాష్, ఎసయ్యా ఫోటోలకు పూలమాలలు వేసి ఘనంగా విప్లవ జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజు మాట్లాడుతూ పాలక పార్టీలు ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు చేస్తూ గద్దెనెక్కినాక ప్రజలను మర్చిపోతున్నారని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులు, రైతులు ఉద్యోగులు ప్రజలకు వ్యతిరేకంగా విధానాల ని అవలంబిస్తూ అంబానీ ఆదాని లాంటి కార్పొరేట్ల కు ఊడిగం చేస్తుందని అన్నారు. ధరల పెరుగుదల అదుపు చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. ప్రభుత్వంపై వస్తున్న సంతృప్తిని సైడ్ చేయడం కోసం మతోన్మాద ఎజెండాను అమలు చేస్తుందని అన్నారు. నిత్యవసర సరుకులు ధరలు రోజురోజుకు పెద్ద ఎత్తున పెంచి సామాన్య ప్రజల పై భారాలు వేస్తుందని అన్నారు. రాజ్యాంగం ప్రజాస్వామ్యం లౌకిక విలువలపై దాడి చేస్తుందని అన్నారు. వీటిని ప్రజలు ఐక్యంగా చెప్పి కొట్టాలని కోరినారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అండగా సిపిఎం ఎర్రజెండా ఉంటదని అన్నారు. పేదల భూములు గుంజుకొని పెద్దలకు అప్పచెబుతున్నారని అన్నారు. ధరణిలో పేదల సైన్మెంట్ భూములకు నేటికీ అనేక గ్రామాలలో పట్టా పాస్ పుస్తకాలు రాలేదని అన్నారు. పేదలకు భూములు పంచింది, ఇళ్ల స్థలాల కోసం పోరాడింది కమ్యూనిస్టులు ఎర్రజెండానే అన్నారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నది సిపిఎం అన్నారు. సమస్యల పరిష్కారానికి పోరాటం తప్ప మరో మార్గం లేదని అన్నారు .
ఈ సభలో సిపిఎం ఏరియా కమిటీ కార్యదర్శి రాంచందర్,కమిటీ సభ్యులు మహిపాల్, నర్సయ్య, చంద్రన్న, కనకరెడ్డి,సంగన్న, కౌది నర్సిములు, తుల్జరం, నరేష్,నర్సిములు, ఫహీమ్, శంకర్,దశరాత్, విరయ్య గౌడ్, రాజిరెడ్డి,సభ్యులు కాకర్తలు తదితరులు పాల్గొన్నారు