సైబర్‌ నేర సామ్రాజ్యంపై పోరాటం

Fighting the cyber crime empireసోనూసూద్‌ నటిస్తూ, రచన-దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఫతే’. ఆయన దర్శకత్వంలో వస్తున్న తొలి చిత్రం కావడంతో పాటు, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ, ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది. ఈ సందర్భంగా సోనూసూద్‌ మాట్లాడుతూ, ‘ఎన్నో సంవత్సరాలుగా ప్రేక్షకుల నుండి నేను అందుకున్న ప్రేమ అసాధారణమైనది. ఇప్పుడు ఈ చిత్ర టీజర్‌తో మరోసారి ప్రేక్షకుల నుండి వెల కట్టలేని ప్రేమను చూస్తున్నాను. ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకమైనది. ఇది దర్శకుడిగా నా అరంగేట్రం మాత్రమే కాదు. మనలో చాలా మంది తక్కువగా అంచనా వేసే భయంకరమైన ముప్పు అయినటువంటి సైబర్‌ ప్రపంచంలోని అదశ్య, చీకటి శక్తులకు వ్యతిరేకంగా ఇది ఒక వాయిస్‌. రియల్‌కి, వర్చువల్‌కి మధ్య జరిగే ఆసక్తికర ఆటను, సీట్‌ ఎడ్జ్‌లో కూర్చుని చూసేలా చేసే యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. మనలో చాలా మంది చూడని యుద్ధాలను ధైర్యంగా ఎదుర్కొనే హీరోలందరి కోసం ఈ చిత్రం చేశాను’ అని అన్నారు. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, విజరు రాజ్‌, నసీరుద్దీన్‌ షా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్‌, శక్తి సాగర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై సోనాలి సూద్‌, ఉమేష్‌ కెఆర్‌ బన్సాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 10న రిలీజ్‌ కానుంది.