ప్రజా సమస్యలపై పోరాటాలు ఉధృతం

ప్రజా సమస్యలపై పోరాటాలు ఉధృతం– మతోన్మాద రాజకీయాలను తిప్పి కొట్టాలి
– సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కారాములు
నవ తెలంగాణ – పటాన్ చెరు
ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కారాములు అన్నారు. పటాన్ చెరు పట్టణంలోని ఐలాభవన్ లో జరిగిన సిపిఎం పటాన్ చెరు ఏరియా రెండవ మహాసభల ప్రారంభోత్సవములో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చుక్క రాములు జెండావిష్కరణ చేయడం జరిగింది. అనంతరం ప్రతినిధుల సభలో చుక్కా రాములు మాట్లాడుతు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ఇతర సమస్యలను ముందుకు తేవడం సిగ్గుచేటన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం మతోన్మాద విధానాలను విడనాడాలని, మతోన్మాదం పెరగడం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజల మధ్య చీలికలు వస్తున్నాయని ఈ చీలికల రాజకీయాలను బిజెపి మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కార్పొరేటికరణ విధానాలను మానుకోవాలని హితవు పలికారు. ప్రజా, రైతు, కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించాలని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడూ గ్యారంటీలన్నిటిని అమలు చేయాలని ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించవద్దన్నారు.సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి మల్లేష్ మాట్లాడుతూ రాబోయే కాలంలో ప్రజా సమస్యలపై ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలను సమస్యల ప్రాతిపదిగా సిద్ధం చేయాల నిసూచించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య పటాన్ చెరు ఏరియా నాయకులు వాజీద్ అలీ, పాండురంగారెడ్డి, నాగేశ్వరరావు, పెంటయ్య, జార్జ్, సునీత, లలిత, బి వి ఆర్ కె రాజు, రమణారెడ్డి, సురేందర్ రెడ్డి, శాంత కుమార్ తదితరులు పాల్గొన్నారు