వేదిస్తున్నాడని పాత్రికేయునిపై పిర్యాదు చెయి..?

– అక్రమాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీసీకి అధికార పార్టీ నాయకుడి పురాయింపు?
– సీసీని రక్షించే యత్నంలో అధికార పార్టీ నాయకుడి మర్మమేంటి!
నవతెలంగాణ-బెజ్జంకి
ఐకేపీ సీసీ పలు అక్రమాలకు పాల్పడుతూ బెదిరింపులకు గురిచేస్తుతుందని వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసిన పలువురి మహిళ సంఘాల సభ్యుల ఆరోపణల ప్రకారం నవతెలంగాణ దిన పత్రిక పలు వార్తలను ప్రచురించగా సంబధిత అధికారులు స్పందించి మండల పరిధిలోని బేగంపేట, పెరుకబండ గ్రామంలోని స్థానికుడి పిర్యాదు మేరకు ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో వెలుగుచూసిన అక్రమాలపై హుస్నాబాద్ డివిజన్ అడిటర్ ప్రసాద్ రికార్డులను తనిఖీలు చేసి విచారణ చేపట్టారు. విచారణలో వెలుగుచూసిన అక్రమాలపై విచారణ అధికారి నివేదిక రుపోందించి సంబంధిత జిల్లాధికారికి సమర్పించారు. ఇంతవరకు అధికారులు విధుల్లో వహించిన శ్రద్ధ,వ్యవహరించిన తీరు బాగానే ఉన్న నివేదిక ప్రకారం చర్యలు చేపట్టడంలో జాప్యం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలు సీసీకి మెండుగా ఉన్నాయని గ్రహించిన అధికారులు భయబ్రాంతులకు గురై చర్యలు చేపట్టడంలో తలోగ్గుతున్నారేమోనని గుండారం క్లస్టర్ గ్రామాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.సత్వర చర్యలు చేపట్టడంలో అధికారులు వెనుకంజ వేయడాన్ని ఆసరాగా చేసుకుని ఐకేపీ సీసీ అధికార పార్టీ నాయకుల అండదండలను కూడగట్టుకుని తను విధులు నిర్వర్తించిన క్లస్టర్ గ్రామాలను విడిచివెళ్లకుండా యథావిధిగా మళ్లీ విధులు నిర్వహించే యత్నంలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది.సంబధిత జిల్లాధికారులు తనపై చర్యలు చేపడితే తనతో పాటు తోటి ఐకేపీ సిబ్బందిని సైతం బలిచేయడానికి వేనుకాడబోనని భయబ్రాంతులకు గురిచేస్తున్నట్టు వినికిడి.కొనుగోలు కేంద్రంలో పనిచేసిన మహిళ సంఘాల సభ్యుల ఆరోపణల మేరకు ఐకేపీ సిబ్బంది అక్రమాలపై వార్తలు ప్రచురించిన పాత్రికేయునిపై వేదింపులకు గురిచేస్తున్నాడని నిరాధారమైన ఆరోపణతో పోలిస్ స్టేషన్ యందు పిర్యాదు చేయించేల మండల కేంద్రానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు సీసీని పురామాయిస్తున్నట్టు సమాచారం.అధికారుల విచారణలో పలు అక్రమాలు ఎదుర్కొంటున్న సీసీని రక్షించడానికి అధికార పార్టీ నాయకుడు యత్నిచడంలో మర్మమేంటని పలువురు ఆశ్చర్యపోతున్నారు.అడిటర్ ప్రసాద్ విచారణ నివేదికపై జిల్లా ఏడీపీ రవీందర్ రావును వివరణ కోరగా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని త్వరతగతిన చర్యలు చేపడుతామని తెలిపారు.విచారణ నివేదిక ప్రకారం సీసీపై అధికారులు ఇప్పటికైన సత్వర చర్యలు చేపడుతారో?లేకా అధికార పార్టీ నాయకుడికి తలోగ్గి ఇంకేంతకాలం జాప్యం చేస్తారో వేచి చూడాలి.