– ఎంఎస్ ఎఫ్ తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షుడు దినేష్ మాదిగ..
నవతెలంగాణ – డిచ్ పల్లి
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించి ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి 11062 టీచర్ పోస్టులను ఎస్సీ వర్గీకరణ లేకుండా అమలు చేయడం మాదిగ జాతికి నమ్మక ద్రోహం చేయడమే అవుతుందని ఎంఎస్ఎఫ్ తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షుడు దినేష్ మాదిగ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 30ఏళ్ల పోరాటం ద్వారా సుప్రీం కోర్టు తీర్పుతో ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటే ఆ ఫలాలు మాదిగలకు అందకుండా రేవంత్ రెడ్డి కుట్ర చేయడం దారుణమన్నారు. దేశంలోని ఎస్సీ వర్గీకరణను ముందుగా తెలంగాణలోనే అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకు విరుద్ధంగా తన పరిధిలో ఉన్న విద్యాశాఖలోనే ఎస్ సివర్గీకరణ లేకుండానే 11062 ఉద్యోగాల భర్తీకి సిద్ధపడటం అత్యంత దారుణమని విమర్శించారు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ లేకుండా అడ్మిషన్లు జరుగుతున్న వేల విద్యా అవకాశాలు నష్టపోతున్నారని, రేవంత్ రెడ్డి వైఖరిని నివసిస్తూ ఈ నెల అక్టోబర్ 9న జరుగు అన్ని జిల్లాల, మండలాల నల్ల జెండాలతో నిరసిస్తూ ప్రదర్శనలు జరుపుతామని తెలిపారు. ట్యాంక్ బండ్ పై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి బషీర్ బాద్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు మాదిగ విద్యార్థులు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని నల్ల జెండాలతో నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షుడు దినేష్ మాదిగ పిలుపునిచ్చారు.