బేటి బచావో.. బేటి పడావో కార్యచరణ ప్రణాళికలో భాగంగా చిత్ర ప్రదర్శన..

నవతెలంగాణ – రెంజల్
మహిళ శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ పరిధిలో మహిళా సాధికారిత కేంద్ర ఆధ్వర్యంలో చిత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగిందని ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి తెలిపారు. ఈ చిత్ర ప్రదర్శన ద్వారా బాల్యవివాహాలు, మహిళలపై అరాచకాలు, హింస, అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్లు, పిసిపి ఎన్ డి టి గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్బి కోఆర్డినేటర్ విజయలక్ష్మి, మహిళ సాధికారిక జిల్లా సమన్వయకర్త పి. స్వప్న పోలీస్ డిపార్ట్మెంట్, గ్రామ కార్యదర్శి రాజు, ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి, అంగన్వాడి కార్యకర్తలు విజయలక్ష్మి, శాంత, ఈ, శాంత, జిల్లా సాధికారిక సిబ్బంది గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.