– ఆందోళనలో ప్రజలు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామపంచాయతీ పరిధిలోగల పాతరుద్రారం అపరిశుభ్రంగా మారడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, మిషన్ భగీరథ తాగునీరు కలుషితం కాకుండా చూడాలని పలుమార్లు అధికారులకు ప్రజలు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. గ్రామంలో 1వ,6వ రెండు వార్డుల్లో మురికి కాల్వలు చెత్త, చెదారంతో నిండిపోయి దుర్వాసన వేదజల్లుతొందని, మిషన్ భగీరథ నీరు సరఫరా అయ్యే గెట్ వాల్ మురుగు నిరుతో నిండిపోయి పైప్ లైన్ల ద్వారా ఇంటింటా మురికి నీరు సరఫరా అవుతుందని,అంతర్గత రోడ్లు బురమయం, ఇళ్ల ఆవరణలో మురికి నీరు, ఏపుగా పెరిగిన గడ్డతో నిత్యం దోమలు,ఈగలు రాజ్యమేలుతున్నట్లుగా గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధించిన ఉన్నతాధికారులు పట్టించుకోని గ్రామంలో మిషన్ భగీరథ గెట్ వాలో ప్రవహిస్తున్న మురికి నీటిని తొలగించి,పారిశుధ్య పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.