– కటకం సుదర్శన్‌కు ప్రజాపంథా జోహార్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీపీఐ(మావోయిస్టు) పోలిట్‌బ్యూరో సభ్యులు కటకం సుదర్శన్(ఆనంద్) మరణం పట్ల సీపీఐ(ఎంఎల్)ప్రజాపంథా విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఒక ప్రకటన విడుదల చేశారు.కటకం సుదర్శన్ చివరి శ్వాస వరకు పీడితులకోసం పనిచేశారని తెలిపారు. సింగరేణి కార్మిక కుంటుంబం నుంచి కార్మిక నాయకుడిగా ఎదిగి, భారత విప్లవోద్యమానికి అంకితమై పనిచేశారని పేర్కొన్నారు. ఆదివాసుల, పీడితుల కోసం ఎన్నో పోరాటాలు నిర్మించారని తెలిపారు. ఐదు దశాబ్దాలుగా తాను నమ్మిన రాజకీయాలకోసం దండకారణ్యంలో పనిచేశారని గుర్తు చేశారు. ఆయనకు ప్రజాంపంథా విప్లవ జోహార్లు అర్పిస్తున్నదని తెలిపారు.