మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలో గల హనుమాన్ దేవస్థానం భూమి సర్వే నెంబర్లు 148/1,148/2 ఈ రెండు సర్వే నెంబర్లలో మొత్తం 14 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. ఈ భూమి కౌలు వేలంపాట నిర్వహించడంలో ఎన్నో ఆటంకాలు రావడం కౌలు వేలం పాట ఒకటి రెండుసార్లు వాయిదాలు వేయవలసివచ్చింది. ఈసారి వాయిదాలు పడకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ పకడ్బందీ గా అన్ని రకాలు ఏర్పాటులతో గురువారం నాడు మేనూర్ గ్రామపంచాయతీ ఆవరణంలో హనుమాన్ దేవస్థానం భూమి కౌలు వేలంపాట భారీ బందోబస్తు మధ్య నిర్వహించారు. ఈ వేలంపాటలో భారీ సంఖ్యలో కౌలుదారులు పాల్గొనగా దేవస్థానం భూమి కౌలు సాధించుకోవడానికి పోటీపడ్డారు చివరిగా మద్నూరు గ్రామానికి చెందిన గల్బే వార్ హనుమంత్ రూ.8 లక్షల 51 వేల రూపాయలకు దక్కించుకున్నారు. ఈ వేలం పాట దేవస్థానం భూమి కౌలు ధర రికార్డు లోకి ఎక్కింది. ఈ ప్రాంతంలో ఎకరాకు కౌలు భూమి అత్యధికంగా రూ.20 నుండి 25 వేలు పలుకుతుంది. కానీ దేవస్థానం భూమి రూ.60 వేల రూపాయలకు ఎకరం చొప్పున వేలం పాట పాడింది. మేనూర్ హనుమాన్ దేవస్థానం భూమి లక్షల్లో పలకడం మండల వాసులు కౌలు సాధించుకున్న హనుమంతుకు ప్రతి ఒక్కరు అభినందించారు. ఈ వేలం పాట దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉమ్మడి నిజాంబాద్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్ దేవాలయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కమల బాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ ఆలయాల చెందిన అధికారులు ధూప దీప నైవేద్య అర్చకులు పోలీస్ బందోబస్తు మధ్య సాగింది. భారీ మొత్తంలో వేలంపాట సాగినందుకు సాధించుకున్న హనుమంతుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అతనికి అభినందించారు దేవస్థానం భూమి లక్షల్లో వేలంపాట పాడి సాధించుకున్న హనుమంతుకు కర్రే వార్ రాములు స్వీట్లు తినిపించి అభినందించారు. వేలంపాట పూర్తి కాగానే అధికారులు దేవస్థానం భూములను సందర్శించి కౌలు సాధించుకున్న హనుమంతుకు హద్దులు చూపించారు. ఆయన స్వాధీనంలో ఇస్తున్నట్లు ప్రకటించారు మే నూర్ హనుమాన్ దేవస్థానం భూములు లక్షల్లో కౌలు వేలం పాట పాడడం మండల ప్రజలు హర్షం వ్యక్తం అయింది.