ఇస్లామాబాద్ : ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో పోటీపడేందుకు భారత పర్యటనకు వస్తున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఎట్టకేలకు వీసాలు లభించాయి. భారత్‌కు బయల్దేరేందుకు 48 గంటల ముందు ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం పాక్ క్రికెట్ జట్టుకు వీసాలు మంజూరు చేసింది. వరల్డ్‌కప్‌లో ఆడుతున్న ఇతర జట్లకు ఇప్పటికే వీసాలు ఖరారు కాగా.. పాకిస్థాన్‌కు మాత్రమే ఆలస్యం అయ్యాయి. ఇతర జట్లు ఆగస్టులోనే వీసాలకు దరఖాస్తు చేసుకోగా.. ఆసియా కప్‌లో ఆడుతున్న పాకిస్థాన్ సెప్టెంబర్ 19నే వీసాలకు దరఖాస్తు చేసింది. వీసా ఆలస్యంతో దుబారులో శిక్షణ శిబిరం సైతం రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. వీసాల ఆలస్యంపై ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేయగా.. సోమవారం సాయంత్రం గ్రీన్ సిగల్ వచ్చింది. బుధవారం దుబారుకి రానున్న పాక్ జట్టు.. అక్కడి నుంచి అదే రోజు హైదరాబాద్‌కు చేరుకోనుంది. ఓ రోజు విరామం అనంతరం ఈ నెల 29న ఉప్పల్‌లో న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్‌లో ఆడనుంది.