
మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన రంగుల భూమేష్ గౌడ్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. కొన్ని రోజుల క్రితం వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు. అతని కూతురు రంగుల నిషిత ఢిల్లీలోని బిట్స్ పిలానిలో బిఎస్సి కంప్యూటర్ సైన్స్ లో సీటు సాధించిందని తెలుసుకొని ఆమె పై చదువుల కోసం రూ.30వేలు ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలిపారు. విద్యార్థిని నిషితను అభినందించి ధైర్యంగా చదువుకొని ఉన్నత స్థానంలో నిలబడాలని సూచించారు. చదువు విషయంలో ఏ ఇబ్బంది ఎదురైన తనను సంప్రదించాలని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం మంగళవారం ఉప్లూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని నిశితకు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్ముల రవీందర్, బోనగిరి లక్ష్మణ్, అవారి సత్యం, బోనగిరి భాస్కర్, సుంకరి విజయ్ కుమార్, పత్రి రవి, మంతెన బాజా గౌడ్, రాజశేఖర్, రంగు రాజేశ్వర్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.