
నవతెలంగాణ – నూతనకల్
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన పుష్పలత గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకుని జనం కోసం మనం గ్రూప్ సభ్యులు ఆదివారం పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ.. ఆమె ఆర్థిక సమస్యలతో పేదరికం వల్ల మందులకు కూడా డబ్బుల లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకొని సహాయం చేసినట్లు తెలిపారు నిస్సహాయులకు, పేదలకు సహాయం చేయడమే గ్రూప్ లక్ష్యమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రేసు రవి, గంట నాగన్న, ఉడుగుల మురళి, గడ్డం జానయ్య తదితరులు పాల్గొన్నారు.