ఆర్థిక సహాయం అందజేత

నవతెలంగాణ ఆర్మూర్  

పట్టణంలోని లైన్మెన్ సంతోష్ శబరిమలకు వెళ్తున్న కన్నె స్వామి బబ్లూకు 2005 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏడాది కన్నె స్వాములకు తన వంతుగా ఆర్థిక సాయం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, కౌన్సిలర్లు తాటి హనుమండ్లు, జహీర్ అలీ, విజయ్ స్వామి తదితరులు పాల్గొన్నారు..