నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ మండలం, చింతబాయిగూడానికి చెందిన గోపగాని శ్రీనాథ్‌గౌడ్ గత నెల 22వ తేదీన అకాలంగా మరణించాడు.తమతో పాటు పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న బాల్యమిత్రులు రూ.31,716లను సేకరించి మృతుని భార్యబిడ్డలకు ఆదివారం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎన్. సతీష్, జె.నాగరాజు, పి.సతీష్, జి. మురళి, కే. నగేష్, టి. నాగేంద్రబాబు, టి. రవి, బి. శ్రావణ్, ఎస్.అరుణ్ కుమార్, కె.రమేష్, జి.రవీందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. డిండి:డిండి గ్రామానికి చెందిన ముదిరాజ్ కార్యవర్గ సభ్యుడు పొలం కష్ణయ్య మరణించినందున ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆయన కుటుంబసభ్యులకు రూ. 15వేల ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు పోలం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పొలం లక్ష్మణ్, సాయిబాబా, గుడి రాములు, తవిటి సైదులు, సంఘ సభ్యులు నుకం వెంకటేష్, తవిటి మల్లయ్య నుకాం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.