ఆర్థిక సహాయం చెక్కు అందజేత

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండల కేంద్రానికి చెందిన ఆమెడ నరేందర్ కు  తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు చేసిన ఆర్థిక సహాయం చెక్కును ఆదివారం అందజేశారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం తీసుకున్న నరేందర్ ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ చొరవతో ప్రభుత్వం రూ. 60వేల ఆర్థిక సహాయం చెక్కును మంజూరు చేసింది. అట్టి చెక్కును కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేందర్ ఇంటికి వద్దకు వెళ్లి అందజేశారు. ఆర్థిక సహాయం చెక్కు మంజూరు చేసిన ముత్యాల సునీల్ కుమార్ కు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లబ్ధిదారు నరేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నూకల బుచ్చి మల్లయ్య, నిమ్మ రాజేంద్రప్రసాద్, ఉట్నూరి ప్రదీప్, వేముల గంగారెడ్డి, నల్ల గణేష్ గుప్తా, నల్ల సాయికుమార్ గుప్తా, అజ్మత్ హుస్సేన్, నరేందర్, అజారుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.