ఏర్గట్ల మండలకేంద్రానికి చెందిన ఎస్.కె.మోషీ కుమారుడు గుండె సంబంధిత వ్యాధితో భాధపడుతున్నాడని,స్థానిక కాంగ్రేస్ నాయకుల ద్వారా తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి,బాలుడి వైద్య ఖర్చుల కోసం రూ.10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పంపడంతో, స్థానిక నాయకులు బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు రేండ్ల రాజారెడ్డి, నాయకులు కల్లెడ పురుషోత్తం, దండేవోయిన సాయి కుమార్,గణేష్,తదితరులు పాల్గొన్నారు.