నవతెలంగాణ-యాచారం
యాచారం మండల పరిధిలోని నందివనపర్తి గ్రామానికి చెందిన తెలుగమళ్ల రాములమ్మ అనారోగ్యంతో మతి చెందారు. విషయం తెలుసుకున్న బీ.ఎన్.రెడ్డి ట్రస్ట్ చైర్మెన్ బిలకంటి చంద్రశేఖర్ రెడ్డి ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆమె మతదేయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సోమవారం ఆమె అంత్యక్రియలకు బీ.ఎన్.రెడ్డి ట్రస్ట్ తరఫున ఆయన ఆర్థిక సాయం అందజేశారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు బీ.ఎన్.రెడ్డి ట్రస్ట్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొంగల్ల జోగి రెడ్డి, తదితరులు ఉన్నారు.