ఆడపిల్ల పెండ్లికి ఆర్థిక సాయం

నవతెలంగాణ-ఆమనగల్‌
కడ్తాల్‌ మండలం గానుగుమర్ల తండా గ్రామ పంచాయతీ పరిధిలోని కానుగుబాయి తండాకు చెందిన నేనావత్‌ సుగుణ భీమా దంపతుల కూతురు మాన్విక వివాహం నేడు జరుగనుంది. శుక్రవారం విషయం తెలుసుకున్న జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్‌ నాయక్‌ తన కుమారుని జ్ఞాపకార్థం స్థాపించిన జర్పుల రాధాకృష్ణ మెమోరియల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా మాన్విక వివాహానికి ఆర్థిక సహాయంగా రూ.21 వేలతోపాటు పట్టు నూతన వధువుకు పెండ్లి కానుకగా పట్టుచీరను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేష్‌గుప్తా, వైస్‌ ఎంపీపీ ఆనంద్‌, సింగిల్‌ విండో డైరెక్టర్‌ సేవ్యా నాయక్‌, మాజీ సర్పంచ్లు తులసి రామ్‌నాయక్‌, హరిచంద్‌ నాయక్‌, శ్వేతా భూనాథ్‌, మాజీ ఉపసర్పంచ్లు రామకృష్ణ, శారదా పాండు నాయక్‌, నాయకులు భీమన్‌, లక్ష్మణ్‌, రమేష్‌, శ్రీను, రాజు, చందర్‌, హరియా, రాజేష్‌, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.