– ఏఎస్పీ శేషాద్రిని చేతులమీదుగా అందజేత..
నవతెలంగాణ – వేములవాడ
ఈనెల 9న పేదింటి అమ్మాయి వివాహం జరగనుండడంతో పెళ్లికూతురు తల్లి కోసిని లక్ష్మి ట్రస్టును సంప్రదించగా ట్రస్టు,ఇతర గ్రూపులలో పోస్ట్ చేయగా దాతలు స్పందించి పట్టుచీర, 50కిలోల బియ్యం, 25వేల రూపాయలు విరాళాల రూపంలో అందించగా శనివారం పెళ్లికూతురు తల్లి లక్ష్మికి వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగిందని ట్రస్టు నిర్వహకులు తెలియజేశారు. ట్రస్టు సభ్యులు డాక్టర్. బెజ్జంకి రవీందర్, గొంగళ్ళ రవికుమార్ మాట్లాడుతూ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేసిన 24 గంటల్లో స్పందించి విరాళాలు అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఏ ఎస్ పి శేషాద్రి రెడ్డి మాట్లాడుతూ పేదింటి అమ్మాయికి హార్దిక సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను అభినందించారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్, తాళ్లపల్లి ప్రశాంత్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, పొలాస రాజేందర్, తోట రాజు, నంది సాయికుమార్, పసుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.