పేద విద్యార్థిని చదువు ఆర్థిక సహాయం…

– వేములవాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు మారం కుమార్..
నవతెలంగాణ – వేములవాడ 
వేములవాడ పట్టణములో కుమ్మరివీదికి చెందిన గోగికర్ శివాని బి ఫార్మసీ చదువు కొరకు వేములవాడ లయన్స్ క్లబ్ సభ్యులు 30 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు  మారం కుమార్ మాట్లాడుతూ వేములవాడ లయన్స్ క్లబ్ ద్వారా పేద విద్యార్థుల ఉన్నత చదువులకు మా లయన్స్ సభ్యుల సహకారముతో నగదును అందించుటకు నిర్ణయం తీసుకున్నామనిఅన్నారు. గొగికర్ శివాని పై చదువుల నిమిత్తం 30000 నగదును అంద చేశామని అన్నారు. జిల్లా క్యాబినెట్ మెంబర్ లయన్ గోగికర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పేద విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని లయన్ సభ్యుల సహాకారంతో, సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు .ఈ కార్యక్రమములో వేములవాడ లయన్స్ క్లబ్ సభ్యులకు లయన్ తీగల వెంకటేశ్వర రావు, ఉపాధ్యక్షుడు లయన్ వంగపల్లి ప్రశాంత్,లయన్ వరాల  వెంకట కృష్ణ  శివాని బందువులు పాల్గొన్నారు.