నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్త అంత్యక్రియల కోసం పార్టీ నగరాధ్యక్షుడు కేశవేణు రూ .10 వేల ఆర్థిక సాయం చేశారు. బుధవారం రాత్రి నగర శివారులో కార్యకర్త ఎర్రం అంజయ్య ప్రమాదవశాత్తు కాలువలో పడి మరణించిన విషయం తెలిసిందే. కాగా గురువారం అంజయ్య అంత్యక్రియల కోసం కేశ వేణు ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.