నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ గుమ్మల జమున పెళ్లికి, గ్రామ సన్ రైజర్స్ యూత్ ఆధ్వర్యంలో బుధవారం రూ.5116 సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడు మంతెన రాజశేఖర్ మాట్లాడుతూ.. జమున పెళ్లి ఈ నెల 23న ఉండడంతో, కడు దయనీయ స్థితిలో ఉన్న ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ చిరు సహాయాన్ని అందించామన్నారు. దాతలు ముందుకు వచ్చి ఆ కుటుంబానికి సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మంతెన రాజశేఖర్ (అధ్యక్షులు ) ముమ్మడి హరికృష్ణ (ఉపాధ్యక్షులు ) మంతెన నగేష్ (కోశాధికారి ) వొళ్ళలా సుదర్శన్ గౌడ్ (సలహాదారులు ) శ్రీమంతుల వెంకటేష్ (సలహాదారులు ) మంతెన కిష్య్య (సలహాదారులు ) యూత్ సభ్యులు పాల్గొన్నారు.