గౌతమ్ కు బుసిరెడ్డి పౌండేషన్ ఆర్థిక సహాయం

 నవతెలంగాణ -పెద్దవూర: నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, త్రిపురారం మండలం కేంద్రానికి చెందిన ఉడుగుల సునీత పుత్రుడు గౌతమ్ కి కాళ్ళు, చేతులు చచ్చుపడి లేవలేని స్థితిలో మంచానికే పరిమితమై బాధపడుతున్నాడు. పేద కుటుంబం కావడంతో ఆసుపత్రిలో చూపించుకోలేని స్థితి వారిది ఈ విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికీ బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండురంగారెడ్డి రూ.5వేలు ఆర్థిక సహాయం మంగళవారం అందజేశారు. ఈ కార్యకర్తలు లో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, అనుముల అనంత రెడ్డి, భరత్ రెడ్డి, మాజీ కో ఆపరేటివ్ నాగెండ్ల కృష్ణారెడ్డి, తిరుమలగిరి సాగర్ మండలం మైనారిటీ సెల్ అధ్యక్షుడు నయీమ్ పాష, గోవిందరెడ్డి,గడ్డం సజ్జన్, అబ్దుల్ కరీం, మొయిన్ పాషా, రమేష్ చారి, కొండలు, గజ్జల శివానంద రెడ్డి త్రిపురారం యువత మరియు తదితరులు పాల్గొన్నారు.