ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం అల్లాపురం గ్రామానికి చెందిన భూతం లింగస్వామి అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం మృతి చెందారు. భూతం లింగస్వామి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న సరళ మైసమ్మ ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు సమకూర్చిన రూ.16,000 వేల నగదు ఆర్థిక సహాయాన్ని భూతం లింగస్వామి భార్య పూజకు ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అర్ధ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జర్పుల భాస్కర్ నాయక్ కార్యదర్శి రాసాల మహిపాల్ యాదవ్ కోశాధికారి నల్లబోతు యాదగిరి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.