నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇటివల ఒక రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన బీజేపీ నాయకుడు దోన్కంటి గంగదాస్ కుటుంబానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వీంద్ మంగళవారం పరామర్శించారు. ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామానికి చెందిన గంగదాస్ ఇటివలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకుని ఎంపి ధర్మపురి అర్వీంద్ సందర్శించి అర్వీంద్ ఫౌండేషన్ ద్వారా రూ.1ఒక లక్షా రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, పిల్లల విద్య కోసం సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అయన వేంట బిజెపి జిల్లా అధ్యక్షులు కులచారి దినేష్ కూమార్,మండల అధ్యక్షులు నాయిడి రాజన్న,వాసు, ప్రదీప్ రెడ్డి, కొత్తూరు సురేష్,పూదరి మనోహర్ తోపాటు తదితరులు ఉన్నారు.