వికలాంగ విద్యార్థికి వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం.

నవతెలంగాణ-గోవిందరావుపేట 
మండలంలోని బుస్సాపూర్ గ్రామానికి చెందిన ఎడవల్లి రాజిరెడ్డి జీవితల కుమారుడు ఎడవెల్లి ఆజాద్ రెడ్డి తన మొదటి వేతనంలో వెయ్యి రూపాయలు సోమవారం మండలంలోని చల్వాయి పాఠశాలలో వికలాంగ విద్యార్థికి సహాయంగా అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాటన్ మల్లారెడ్డి మాట్లాడుతూ ఆజాద్ రెడ్డి తన మొదటి సంపాదనలో వెయ్యి రూపాయలు వికలాంగ విద్యార్థికి ఆర్థిక సహాయంగా అందించడం అందరము హర్షించదగ్గ విషయమని అన్నారు. ఆజాద్ రెడ్డి అందించిన ఆర్థిక సహాయం ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ ఆర్థిక సహాయం ప్రధానోపాధ్యాయుడినైనా తన చేతి మీదుగా అందించడం సంతోషంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో ఇతరులు కూడా ఆజాద్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ వాసుదేవ రెడ్డి ఉపాధ్యాయ బృందం శ్యాంసుందర్ రెడ్డి శ్రీదేవి ఎల్ రమేష్ చంద్రారెడ్డి సోలిపురం కెనరా బ్యాంక్ మేనేజర్ రవిచంద్ర గారు పాల్గొన్నారు