
నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని కాటాపూర్ అంగన్వాడి 3వ సెంటర్ అంగన్వాడి టీచర్ రడం సుజాత ఇటీవల మొన్న మంగళవారం హత్య కు గురై మృతి చెందిన విషయం విధితమే. అంగన్వాడి టీచర్ సుజాత దహన సంస్కారాల నిమిత్తం ఐసీడీఎస్ జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత, సీడీపీఓ మల్లీశ్వరి తో కలిసి రూ.20వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి, వారి కుటుంబాన్ని ఓదార్చి పరామర్శించారు. వారు మాట్లాడుతూ.. సుజాత కుటుంబాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ మల్లీశ్వరి గ్రామస్తులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.