ప్రజ్వల్ అపరేషనుకు రూ.40 వేల ఆర్థిక సాయం..

Financial assistance of Rs. 40 thousand for Prajwal Apereshan.– మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు..
నవతెలంగాణ – వేములవాడ రూరల్
ప్రమాదవశాత్తు బంగ్లా పై నుండి పడి తీవ్ర గాయాల పాలైన ప్రజ్వల్( 5 )అపరేషనుకు  ఆర్థిక సహాయాన్ని మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శనివారం అరేపల్లి గ్రామానికి చెందిన  నడిగొట్ల లింగయ్య కు గ్రామస్తుల సమక్షంలో రూ.40,000 వేల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆరేపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ  ప్రజ్వల్ కు వచ్చిన కష్టాన్ని తమ కష్టంగా భావించి దాతలు విరాళా రూపంలో అందించి పెద్ద మొత్తాన్ని అందించిన మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులకు, దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ గత గురువారం రోజున రాజేష్ కుమారుడు ప్రజ్వల్ ప్రమాదవశత్తు బిల్డింగ్ రెండవ అంతస్తు పైనుండి కింద పడడంతో  హుటా హుటిన హైదరాబాద్ తరలించమని  డాక్టర్లు సలహా ఇవ్వడంతో హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ వారు ఆపరేషన్ కు దాదాపు రూ.20లక్షలు ఖర్చు అవుతుందని తెలియజేయడంతో ,దిక్కు తోచనిస్థితిలో వున్న  రాజేష్ మిత్రులు మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు  వారికి సమాచారం అందించారు. ట్రస్టు వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా 24 గంటలు గడవక ముందే దాతలు మేము సైతం అంటూ మానవతా దృక్పథంతో స్పందించి దాదాపు రూ.40వేల వరకు విరాళాల రూపంలో అందించడంతో  డబ్బులు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అరెపల్లి వెళ్లి రూ.40వేల రూపాయల చెక్కు ప్రజ్వల్ నడిగొట్ల లింగయ్య కి అందజేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్, డాక్టర్. బెజ్జంకి రవీందర్, గొంగళ్ళ రవికుమార్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్,  పాత సంతోష్, నంది సాయికుమార్, గొండ ప్రసాద్,  పిన్నింటి హనుమాండ్లు, అరెపల్లి గ్రామస్తులు గుండెకార్ల నరేష్, ఇటిక్యాల రాజు, మాంజెడి శ్రీనివాస్, ఇటిక్యాల వెంకటేష్, రంగయ్య, గుండెకార్ల లక్ష్మణ్, నడిగొట్ల శ్రీనివాస్ తోపాటు తదితరులు ఉన్నారు.