భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డి గూడెం గ్రామ రేషన్ డీలర్ కీర్తిశేషులు కుకుట్ల పద్మ మరణించగా , వారి కుటుంబానికి మేమున్నామంటూ జిల్లా రేషన్ డీలర్ల అధ్యక్షులు ఎలగల రాజన్న ఆధ్వర్యంలో 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల ప్రధాన కార్యదర్శి కందుల శంకరన్న హాజరై, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు మన్య యాదగిరి, జిల్లా కోశాధికారి ఉమా దర్శన్ రెడ్డి , భువనగిరి మండల అధ్యక్షులు గంగాదేవి మహేష్, ప్రధాన కార్యదర్శి కూరాకుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చింతల మల్లేశం, ఎడ్ల ఉమా నారాయణరెడ్డి, ఉడుత రమేష్, ఆకుల శ్రీనివాస్, కిరోసిన్ హోల్సేల్ డీలర్ గంప కృష్ణ సేటు వివిధ రేషన్ డీలర్ పాల్గొన్నారు.