నవతెలంగాణ – రాయపర్తి : ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి దిక్కుతోచని స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న బాల్య స్నేహితుడి కుటుంబానికి లక్ష్మీ గణపతి యూత్ సభ్యులు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందజేశారు. వివరాల్లోకి వెళ్తే మండలంలోని వెంకటేశ్వర పల్లి గ్రామానికి చెందిన గుబా వెంకటేష్ ఇటీవల ఆర్థిక ఇబ్బందులకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు కలరు. బాల్యం నుండి కలిసిమెలిసి తిరిగిన మిత్రుడు అకాల మరణం చెందడం బాధాకరమని బాల్య స్నేహితులు తెలుపుతూ గురువారం వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించి 17వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ.. మంచి భవిష్యత్తు ఉన్న మిత్రుడు అర్ధవతరంగా చనిపోవడం బాధాకరమని తెలిపారు. మిత్రుడు కుటుంబానికి ఎల్లప్పుడు లక్ష్మీ గణపతి యూత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ నలమాస సారయ్య, చీకటి కరుణాకర్, గుబా అశోక్, గుబా సంపత్, దికొండ సంపత్, బొమ్మెర అశోక్, చిత్తలూరు కుమారస్వామి, గుబా రాజు తదితరులు పాల్గొన్నారు.