
నిజమైన స్నేహితులు అంటే తోటి స్నేహితులకు ఆపద వచ్చింది అంటే అరక్షణం కూడా ఆగరు వెంటనే స్పందించి సహాయం చేస్తారు. స్నేహానికి ఉన్న విలువ వెంటనే చాటుకుంటారు Z,P,H,S హై స్కూల్ ఉప్పునుంతల 2004-2005 టెన్త్ బ్యాచ్ కి సంబంధించిన ఉప్పునుంతల గ్రామం కొత్తరాంనగర్ జానయ్య రెండు రోజుల క్రితం కొత్తరాoనగర్ బయలుదేరుతుండగా మహాదేవ్ పూర్ గేటు దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలై అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో వెల్దండ దగ్గర ఉన్న యేన్నం హాస్పిటల్ లో వైద్య సేవలు నిర్వహిస్తుండగా అక్కడే రెండు రోజుల నుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం తెలుసుకొని జానయ్య స్నేహితులు పి. మహేష్ రెడ్డి, ఎల్లయ్య యాదవ్, వెంకటేష్ గౌడ్, బర్ల బాలస్వామి, చిన్న జంగయ్య, బాలయ్య, సైదులు, నరేంద్ర చారి, లింగస్వామి, నాగరాజు, ఖాసీం, మణిందర్, శ్రీశైలం, సైదులు, రాజేందర్, కుర్మయ్య, చేంద్రమ్మ కలిసి మానవత్వంతో తోచినంత సహాయం చేద్దామని శుక్రవారం నిర్ణయించుకొని 22,000 వేల రూపాయలు జమ చేసి యెన్నం ఆసుపత్రికి బయలుదేరి జానయ్య పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం అతని భార్యకు 22 వేలు ఇచ్చి స్నేహితునికి ఆపద వచ్చింది అంటే ఏ క్షణమైనా సహాయం చేయడానికి మేమున్నాం అంటూ ధైర్యం చెప్పి అతని కుటుంబాన్ని ఓదార్చిన స్నేహితులు. స్నేహితునికి అండగా ఉండి మానవత్వం చాటిన స్నేహితులకు పలువురు సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలిపారు.