మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత 

Financial assistance to a friend's familyనవతెలంగాణ – కోహెడ 
 మండల కేంద్రానికి చెందిన రేవోజు సురేందర్  ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఆయన కుటుంబ సభ్యులకు ఎస్ఎస్ఎస్సి 2005-06 బ్యాచ్ మిత్రులు ఒక లక్ష రూపాయలు పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేసి బాండును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. మిత్రులు మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇకపై కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలను చేయడం అభినందనీయమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్ననాటి మిత్రులు, తదితరులు పాల్గొన్నారు.