నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లోని సాయినాథ్ టవర్స్ లో బంధువుల ఇంటిలో నివాసముంటున్న కిషన్ రావు ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తూన్నాడు ఆయన భార్య శిల్ప గతంలో సింద్ క్లాత్ ఎంపోరియం లో పని చేస్తూ ఉండేది. ఆమె గతంలోనే కోవిడ్ తో చనిపోవడంతో కిషన్ రావు ఆటో నడుపుతూ ఇంటిని పోషిస్తున్నాడు . ఉండడానికి ఇల్లు కూడాలేక ఆయన కుమారుడు వెంకట సాయి పురోహిత్యం చేస్తూ తండ్రికి చేదోడు వాదోడు గా ఉంటున్నాడు. పూజారి గా పనిచేస్తున్న వెంకట సాయి కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదనికి గురై తీవ్ర గాయాల పాలై వెన్నుముక దెబ్బ తిని లేవలేని పరిస్థితి లో మంచానికే పరిమితమై దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈ నిరు పేద బ్రాహ్మణ కుటుంబ పరిస్థితిని తెలుసుకొని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు కిరణ్ దేశ్ ముఖ్ వారి కార్యవర్గ సభ్యులు ముందుకు వచ్చి ఆ నిరు పేద బ్రాహ్మణ కుటుంబానికి తమవంతు సహాయంగా తోటి బ్రాహ్మణునికి అండగా ఉండాలని సంకల్పించుకొని బ్రాహ్మణ సంఘం సభ్యులందరూ కలిసి ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం కు గాను 60 వేల రూపాయలను శనివారం అందజేయడం జరిగినది. బ్రాహ్మణ సంగం అధ్యక్షులు కిరణ్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ.. ఈ నిరు పేద బ్రాహ్మణ కుటుంబాన్ని ప్రభుత్వము అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వ్తానికి విజ్ఞప్తి చేసారు.ఇప్పటి వరకు ఈయనకు ఏడు లక్షల రూపాయలు వైధ్యానికి ఖర్చు అయ్యిందని తెలియ జేస్తూ దాతలు ఈ నిరుపేద బ్రాహ్మణ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి రొట్టె సురేష్ శర్మ. కోశాధికారి పుల్కల్ రమేష్. ఉపాధ్యక్షులు ఉదయ్ భోదంకర్. పురుషోత్తమ్ పట్వారి. సంఘం సభ్యులు. మెడిచర్ల శ్రీనాథ్. లక్ష్మీనారాయణ భరద్వాజ్. మల్లికార్జున రావు. అమరేశ్వర్. వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.