
మండలంలోని పలువురికి ఆర్థిక సహాయాన్ని పైడి రాకేష్ రెడ్డి పౌడేషన్ అధ్వర్యంలో పౌందేషన్ డైరెక్టర్ సుచరిత రెడ్డి ఆర్థిక సహాయాన్ని శనివారం అందజేశారు. ఈ సందర్భంగా మండలంలోని ఆమ్రద్ గ్రామానికి చెందిన కొంతం గంగాధర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో భార్య సుమలతకు రూ.10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. మాక్లూర్ గ్రామంలోని పల్లె గంగాధర్ కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది చెందుతు పూర్తిగా మంచానికే పరిమితం అవ్వడంతో వారిని పరామర్శించి, కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా పైడి సూచరిత రెడ్డి మాట్లాడుతూ వారి పిల్లల చదువుకు అవసరమైన సహాయం అందిస్తాం అని భరోసా ఇవ్వడం జరిగింది.గ్రామంలో ఎవరు అయిన నిరుపేద విద్యార్థులు ఉంటే వారికి ఫౌండేషన్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో మోహన్,రమేష్,నరేశ్ తదితరులు పాల్గొన్నారు.