– మున్సిపల్ ఛైర్‌పర్సన్ కళా
నవతెలంగాణ-సిరిసిల్ల రూరల్:
బీసీ చేతివత్తుల కులాల కుటుంబాలకు బీసీబంధు పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు రూ.లక్ష చెక్కులను మున్సిపల్ చైర్పర్సన్ కళా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని కులాలు, మతాలు, వర్గాలు అనే తేడా లేకుడా కుల వృత్తుల కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వపరంగా ఆర్థిక చేయూతనందిస్తున్నారని అన్నారు. రెండవ విడతలో పురపాలక సంఘం పరిధిలో 64 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. విడతల వారీగా త్వరలోనే పూర్తిస్థాయిలో కులవత్తులపై ఆధారపడి జీవించే లబ్ధిదారులందరికీ లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయ్యాజ్ , వైస్ ఛైౖర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.