మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం

నవతెలంగాణ -వలిగొండ రూరల్
 మండలంలోని అరూర్ కు చెందిన బోగారం ఊశయ్య, బోగారం ఎల్లయ్య లు అనారోగ్యంతో మృతి చెందడంతో వారికి అదే గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా నాయకులు సి ఎన్ రెడ్డి సౌజన్యంతో 5వేల చొప్పున ఆర్ధిక సాయాన్ని బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల బిక్షపతి, కాలేరు రాం చెందర్, ప్రమోద్ కుమార్, బోగారం రాం దాసు, మల్లయ్య, నారాయణ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.