చిన్నారులకు ఆర్థిక సహాయం ..       

Financial help for children– మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్..
నవతెలంగాణ – వేములవాడ
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయపల్లి  గ్రామానికి చెందిన కొత్తపల్లి పూజ కిషన్ దంపతులకు పదేళ్ల క్రితం వివాహం జరగగా వారికి మణిదీప్ (6), కూతురు దివ్యశ్రీ (2) చిన్నారులు ఉన్నారు, తల్లిదండ్రులు ఇద్దరు కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్న క్రమంలో విధి వక్రించి అనారోగ్య కారణాలతో తల్లి పూజ 5 నెలల క్రితమే మృతి చెందగా తండ్రి ఈనెల జులై 2న అనారోగ్య కారణాలతో కిషన్ మృత్యువాత పడ్డాడు. తల్లితండ్రులు ఇద్దరు కేవలం 5 నెలల వ్యవధిలోనే మృతి చెందడంతో మణిదీప్, దివ్యశ్రీలు ఇద్దరు అనాధలు అయ్యారు. విషయం తెలుసుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వారు ట్రస్టు, ఇతర వాట్సాప్ గ్రూపులలో పోస్టు చేయగా దాతలు మనవతా దృక్పథంతో స్పందించి దాతలు రూ.35వేల రూపాయల వరకు విరాళాల రూపంలో అందించడంతో 35వేల రూపాయల చెక్కును కిషన్ కుటుంబ సభ్యులకు వారి ఇంటికి వెళ్లి అందజేయడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలియజేశారు.   ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్,  బెజ్జంకి రవీందర్, గొంగళ్ల రవికుమార్, పొలాస రాజేందర్, గొండ ప్రసాద్, కోడిమ్యాల, తిప్పాయి పల్లికి సంబంధించిన పులి వెంకటేష్ గౌడ్, కోరండ్ల నరేందర్ రెడ్డి, ల్యాగల రాజేశం, దుబ్బాక శ్రీనివాస్, బొక్కెన కృష్ణకుమార్, దేవదాస్, కొత్తూరు స్వామి, బైరి వెంకటి, పరశురాం పొలాస రాజేందర్,  గొండ ప్రసాద్,  పసుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఏరియా హాస్పిటల్ లో పండ్లు బ్రెడ్డు పంపిణీ
మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్టు సభ్యులు మారం కుమార్  జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో గల 80 మంది పేషెంట్లకు బ్రెడ్ పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.