పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆదేశాల మేరకు కేశవాపురం గ్రామానికి చెందిన చిలుముల్ల ఎల్లయ్య (కామ్రేడ్ ఎల్లయ్య) అనారోగ్యంతో ఆకాలం మరణం చెందగా. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నాయకులు శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షుడు గుజె సుధాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టసుఖాల్లో వెన్నంటే ఉంటామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఝాన్సీ రెడ్డి అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిలుముల్ల రాజు, కోసని సోమిరెడ్డి, భాస్కర్, గాజుల నరేందర్, మద్యాల కొమురయ్య, శేఖర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.