నవతెలంగాణ- నెల్లికుదురు
గ్రామపంచాయతీ పరిధిలో తోటి గ్రామపంచాయతీ సిబ్బంది అయినా ఈసంపల్లి ముత్తయ్య మృతి చెందగా ఆ కుటుంబాన్ని సందర్శించి పరమార్శించి కొంత ఆర్థిక సహాయాన్ని గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికుల యూనియన్ తరపున అందించినట్లు గ్రామపంచాయతీ వర్కర్ యూనియన్ మండల అధ్యక్షుడు మారబోయిన శ్రీనివాస్ కార్యదర్శి బొల్లం ఎల్లయ్య సిఐటియు మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు తెలిపారు శుక్రవారం మునిగేల వీడు గ్రామంలో మృతి చెందిన ఈసంపల్లి ముత్తయ్య కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఎన్నో రకాలైన పనులను నిర్వహించారని ఎంత కష్టమైన పని కూడా తన ఇష్టంతో ఎవరికీ ఇబ్బందులు లేకుండా గ్రామంలో ప్రతి ఒక్కరికి అనుకూలంగా విధులు నిర్వహించారని అన్నారు ఎంతటి గొప్ప వ్యక్తి మృతి చెందడం బాధాకరమని అన్నారు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని తెలిపారు మాతోటి సహచరుడు ఈ గ్రామంలో మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు మా వంతు సహాయంగా నిలబడతామని వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు మారుబోయిన శ్రీనివాస్, కార్యదర్శి బొల్లం ఎల్లయ్య, మండల నాయకులు పాషా, వెంకన్న, రామ్, కోటి, బానోతు వెంకన్న, హెచ్ వెంకన్న, ఇసంపల్లి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.