మండలం లోని పసర గ్రామానికి చెందిన ఎర్రవెల్లి శంకరయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబానికి సీపీఐ(ఎం) పార్టీ గోవిందరావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పరామర్శించి రూ.20వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి తీగల ఆగిరెడ్డి మాట్లాడుతూ.. శంకరయ్య మృతి బాధాకరమని కుటుంబ సభ్యులను ఓదార్చుతూ కుటుంబానికి సీపీఐ(ఎం) పార్టీ అండగా ఉంటామని ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ మండల కమిటీ నాయకులు చిట్టిబాబు, రాజేష్, మల్లారెడ్డి, గ్రామ కార్యదర్శి కడారి నాగరాజు, నాయకులు అంబాల పోషాలు, మురళి, సూర్యనారాయణ, పల్లపు రాజు, ఆదిరెడ్డి, ధర్మారెడ్డి, బ్రహ్మచారి, కొండయ్య, ఐలయ్య, మోహన్ రెడ్డి, బుర్ర శీను, అశోక్, గణేష్, మంచాల కవిత, సంకినేని రాజేశ్వరి, రాజేశ్వరి, శారద, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.