జర్నలిస్ట్ కుటుంబానికి ఆర్థిక సహాయం

నవతెలంగాణ – రాయపర్తి
మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ వలబోజు రవీంద్రాచారి ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందగా సోమవారం జర్నలిస్టు పరపతి సంఘం ప్రతినిధులు రవీంద్రాచారి కుటుంబాన్ని పరామర్శించి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మచ్చ సమ్మయ్య, ఉమేందర్ మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై స్పందించే జర్నలిస్ట్ ఆకాల మరణం చెందడం బాధాకరమన్నారు. కులవృత్తిని కాపాడుకుంటూ జర్నలిజం వృత్తిని ప్రవృత్తిగా చేసుకొని బాధిత కుటుంబాల కష్టాలను వెలికి తీయడంలో ముందుండే వ్యక్తి చూస్తుండగానే కనుమరుగవ్వడం బాధాకరం అన్నారు. కుటుంబం పెద్దదిక్కును కోల్పోవడం తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ రవీంద్రాచారి కుటుంబానికి అండగా ఉండి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.  వారితో పాటు తాళ్లపెళ్లి రమేష్, రఘు మాధవ్, అప్సర్ పాషా(నమస్తే), బొమ్మెర యాదగిరి, కిరణ్ కుమార్ రెడ్డి, మాచర్ల పరమేశ్వర్, మచ్చ రాజు, ప్రసాద్ రావు, ఐత మల్లేష్, గారె సందీప్, శ్రీకాంత్, నాగరాజు తదితరులు ఉన్నారు.