
వీర్నపల్లి మండలం లాల్ సింగ్ తండ గ్రామంలో బుధ వారం భూక్య రాజీ హరిసింగ్ దంపతుల కుమార్తె వివాహానికి గిరిజన వెల్పెర్ ఆర్గనైజేషన్ సొసైటీ ద్వారా నిరుపేద కుటుంబానికి 50 కేజీల బియ్యం,రూ.5 వేలు ఆర్థిక సాయం అందించారు. సొసైటీ వ్యవస్థాపకులు నీరుపేద కుటుంబాలకు, ఆపదలో ఉన్నవారిని సహకారము సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇట్టి ఆర్గనైజేషన్ సంస్థను స్థాపించడం జరిగిందని మాలోతు ప్రకాష్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు భూక్య లోక్ నాయక్ ,భూక్య మదన్, భూక్య నరహరి, శ్రీనివాస్ , తండ నాయకులు పాల్గొన్నారు.